Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్ నుంచి నందిని ఎలిమినేషన్‌కు కారణం అదేనా?

  • ఊహించినట్టే బిగ్ బాస్ నుంచి నందిని ఎలిమినేషన్
  • సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం
  • కౌశల్‌కు పెరుగుతున్న మద్దతు

ఊహించినట్టుగానే బిగ్‌బాస్ హౌస్ నుంచి నందిని బయటకు వచ్చేసింది. నందిని ఎలిమినేట్ కాబోతోందన్న విషయం ఆదివారం ఉదయమే జనాలకు తెలిసిపోయింది. సోషల్ మీడియా మొత్తం గత రెండు రోజులుగా నందిని గురించే మాట్లాడుకుంది. కౌశల్‌కు వ్యతిరేకంగా ఆమె గేమ్ ప్లే చేస్తోందని, కావాలనే కౌశల్‌ను టార్గెట్ చేస్తోందంటూ నందినిపై వ్యతిరేక ప్రచారం ఎక్కువైంది.

 దీనికి తోడు కౌశల్ అంటే గిట్టని నందిని.. తనీష్‌తో సన్నిహితంగా ఉండడం వంటి కారణాలతో సోషల్ మీడియాలో ఆమెపై వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు ఎలానూ ‘కౌశల్ ఆర్మీ’ ఉంది. దీంతో ఆమె ఎలిమినేషన్ పక్కా అని తేలిపోయింది. ఎలిమినేట్ అయిన నందిని వెళ్తూవెళ్తూ రోల్ రిడాపై బిగ్ బాంబ్ ప్రయోగించింది. దీని ప్రకారం రోల్ రిడా వారం పాటు హౌస్‌లోని అందరికీ హెడ్ మసాజ్ చేస్తూ హౌస్‌లోని విషయాల గురించి మాట్లాడుకోవాలి.

కాగా, బిగ్‌బాస్‌ కార్యక్రమం ఇప్పటికే సగం రోజులు పూర్తి చేసుకుంది. షో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. హోస్ట్ నాని కూడా పదును పెంచాడు. మరోవైపు సోషల్ మీడియాలో కౌశల్‌కు భారీ మద్దతు లభిస్తోంది. అతడికి మద్దతుగా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్ అవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే, షో మొత్తం వీరి అధీనంలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. వీరు చెప్పిన వారే ఎలిమినేషన్‌కు గురవుతుండడం గమనార్హం. 
Bigboss
starmaa
Hyderabad
Show
Nani
Nandini

More Telugu News